అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా రోహిత్ రికార్డు

  • బంగ్లాతో  మ్యాచ్ లో రెండు రికార్డులు సవరించిన టీమిండియా ఆటగాళ్లు
  • 75 సిక్సర్లతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ
  • టీ20లో మూడు వికెట్లు సాధించిన పిన్న వయసు భారతీయుడిగా వాషింగ్టన్ సుందర్
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 బంతుల్లో 89 పరుగులు చేసి, చివరి బంతికి పెవిలియన్ చేరిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 74 సిక్సర్లతో అగ్రస్ధానంలో ఉన్న యువరాజ్ సింగ్ ను తరువాతి స్థానానికి నెట్టాడు. ఇదే మ్యాచ్ లో ఒక టీ20లో మూడు వికెట్లు తీసిన పిన్న వయసు భారతీయ బౌలర్‌ రికార్డును వాషింగ్టన్ సుందర్‌ (18 ఏళ్ల 160 రోజులు) సవరించాడు. గతంలో ఈ రికార్డు అక్షర్‌ పటేల్‌ (21 ఏళ్ల 178 రోజులు; జింబాబ్వేపై 2015లో) పేరిట ఉండగా, దానిని సుందర్ సవరించాడు
Go Back to Shorts
Cricket
team india
India
Rohit Sharma

More Telugu News